Home News రోడ్డుపై నిలుచున్న అమ్మాయికి ముద్దిచ్చి…కౌగిలించుకొని..
రోడ్డుపై నిలుచున్న అమ్మాయికి ముద్దిచ్చి…కౌగిలించుకొని..

రోడ్డుపై నిలుచున్న అమ్మాయికి ముద్దిచ్చి…కౌగిలించుకొని..

0
0

పుదుచ్చేరి : తన స్నేహితురాళ్లతో కలిసి రోడ్డుపై నిలుచున్న ఓ అమ్మాయిని పక్కనే ఉన్న ఆటో డ్రైవరు హఠాత్తుగా ముద్దాడి…కౌగిలించుకొని పారిపోయిన ఘటన పుదుచ్చేరి నగరంలోని అన్నాసాలై ప్రాంతంలో జరిగింది. చెన్నైలోని ఓ కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తున్న ముగ్గురు అమ్మాయిలు విహారయాత్ర కోసం పుదుచ్చేరికి వచ్చారు.పుదుచ్చేరిలోని ఓ హోటల్ గదిలో దిగిన అమ్మాయిలు పర్యాటక స్థలాలను సందర్శించేందుకు రోడ్డుపైకి వచ్చి మాట్లాడుకుంటున్నారు. అంతలో పక్కనే ఉన్న ఆటోడ్రైవరు ఆకస్మాత్తుగా ఓ యువతిని అమాంతం వాటేసుకొని కౌగిలించుకోవడమే కాకుండా ముద్దాడాడు.ఈ హఠాత్ సంఘటనతో బిత్తరపోయిన అమ్మాయి తేరుకొని ఆటోనంబరు నమోదు చేసుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆటోనంబరు సాయంతో నిందితుడైన స్టాలిన్ ను పోలీసులు అరెస్టు చేసి, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. మద్యం మత్తులో అమ్మాయిని ముద్దాడానని ఆటో డ్రైవరు పోలీసులకు చెప్పడం కొసమెరుపు.

Source: Abn Andhrajyothy

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *