Home Reviews జయదేవ్‌ రివ్యూ
జయదేవ్‌ రివ్యూ

జయదేవ్‌ రివ్యూ

0
0

సినిమా పేరు: జయదేవ్‌
నటీనటులు: గంటా రవి.. మాళవిక రాజ్‌.. వినోద్‌కుమార్‌.. రవి ప్రకాష్‌.. పోసాని కృష్ణమురళి.. వెన్నెల కిషోర్‌ తదితరులు
ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె.వెంకటేష్‌
సంగీతం: మణిశర్మ
నిర్మాత: కె. అశోక్‌కుమార్‌
దర్శకత్వం: జయంత్‌ సి. పరాన్జీ
విడుదల తేదీ: 30-06-2017
తెలుగు చిత్ర సీమకు పరిచయమవుతున్న యువ కథానాయకుల సంఖ్య తక్కువేమీ కాదు. ఒకరకంగా ఇప్పుడు వారిదే హవా. తాజాగా ఈ జాబితాలోకి ‘జయదేవ్‌’ చిత్రంతో వచ్చి చేరారు గంటా రవి. ఆయన ఆంధ్రప్రదేశ్‌ మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు కావడంతో రవి తొలి చిత్రంపైన అందరిలోనూ ప్రత్యేక ఆసక్తిని రేకెత్తించింది. అదే సమయంలో చాలారోజుల తర్వాత జయంత్‌ సి.పరాన్జీ దర్శకత్వం వహించడం కూడా మరో విశేషం.

తమిళంలో ఘన విజయాన్ని సాధించిన ‘సేతుపతి’ చిత్రాన్ని తెలుగులో ‘జయదేవ్‌’గా తీసుకొచ్చారు. మరి తొలి చిత్రంతోనే రవి ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారా? రవిని జయంత్‌ ఏవిధంగా చూపించారన్న ప్రశ్నలకు సమాధానాలు వెతికితే..

కథేంటంటే: జయదేవ్‌(గంటా రవి) పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌. ఎలాంటి ప్రలోభాలకు లొంగడు. అతనుండే పక్క గ్రామంలో శ్రీరామ్‌(రవిప్రకాష్‌) అనే పోలీస్‌ ఆఫీసర్‌ హత్యకు గురవుతాడు. ఆ కేసు జయదేవ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోకి వస్తుంది. శ్రీరామ్‌ హత్య వెనుక ఎవరున్నారనే దానిపై విచారణ ప్రారంభిస్తాడు జయదేవ్‌. మరోపక్క మస్తాన్‌బాబు (వినోద్‌కుమార్‌) అనేక దుర్మార్గాలకు పాల్పడుతుంటాడు. అతనికి సంబంధించిన సాక్ష్యాలు సేకరించినందుకే శ్రీరామ్‌ను హత్య జరిగిందన్న విషయం తెలుసుకుంటాడు. మరి.. శ్రీరామ్‌ కుటుంబానికి జయదేవ్‌ ఎలాంటి న్యాయం చేశాడు? మస్తాన్‌బాబును ఎలా చట్టానికి పట్టించాడు అనేదే అసలు కథ.

ఎలా ఉందంటే: తమిళ ‘సేతుపతి’కి రీమేక్‌ ఇది. దాని మాతృకను చూపించడానికే దర్శకులు ప్రయత్నించారు. పోలీస్‌ ఆఫీసర్‌గా జయదేవ్‌ భావోద్వేగాలు ప్రధానం. శ్రీరామ్‌ హత్య, దాని చుట్టూ ఏర్పడిన పరిణామాలు కాస్త ఆసక్తిని కలిగిస్తాయి. అయితే హీరోయిన్‌తో లవ్‌ ట్రాక్‌ సరిగా పండలేదు. వెన్నెల కిషోర్‌.. బిత్తిరి సత్తితో నవ్వులు పండించే పయత్నం చేశారు. పోలీస్‌శాఖ ఎంత ఉన్నతమైందో కొన్ని సన్నివేశాల్లో బాగా చూపించారు. అవి ఆకట్టుకునేలా ఉన్నాయి.

ద్వితీయార్ధం అంతా కథానాయకుడు – ప్రతినాయకుడి మధ్య జరిగే పోరాటాన్నే చూపించారు. కథను ముందుకు నడిపించే ఎలిమెంట్స్‌.. మలుపులకు.. ఉత్కంఠ పెద్దగా లేకపోవడంతో సినిమా ద్వితీయార్ధం నెమ్మదించింది. కథాగమనానికి పాటలు అడ్డుపడతాయి. పతాక సన్నివేశాల్లో మళ్లీ ఎమోషన్స్‌ పండించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. యాక్షన్‌ సన్నివేశాలు కాస్త ఆసక్తికరంగా తీర్చిదిద్దడంతో మాస్‌కు నచ్చుతుంది. పోలీస్‌శాఖ గురించి పలికించిన సంభాషణలు ఆకట్టుకుంటాయి.

వరెలా చేశారంటే: గంటా రవికి ఇదే తొలిసినిమా. తన పరిధి మేరకు ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఎమోషన్స్‌ సన్నివేశాల్లో బాగా కనిపించిన రవి మిగిలిని విషయాల్లో ఇంకా రాటుదేలాలి. తొలి ప్రయత్నం కనుక ఓకే. కథానాయిక పాత్ర గ్లామర్‌గా చూపించారు. వినోద్‌కుమార్‌కి చాలాకాలం తర్వాత కీలకమైన పాత్ర దక్కింది. తన కూడా ఓకే అనిపించాడు. వెన్నెల కిషోర్‌.. పరుచూరి వెంకటేశ్వరరావు.. శివారెడ్డిలు తమ పరిధి మేర నటించారు.

సాంకేతికంగా చూస్తే మణిశర్మ సంగీతంలో మెరుపులు లేవు. కానీ నేపథ్య సంగీతం బాగుంది. యాక్షన్‌ దృశ్యాలను భారీగా తీశారు. అడుగడుగునా నిర్మాణ విలువలు కనిపించాయి. తమిళంలో ‘సేతుపతి’ మంచి విజయం సాధించింది. అయితే అక్కడ చాలా అంశాలు అందుకు తోడ్పడ్డాయి. అయితే మన నేటివిటికి తగ్గట్లుగా మార్చుకోకపోవటం ‘జయదేవ్‌’లో కనిపిస్తుంది.

బలాలు
+ పోలీసులకు సంబంధించిన సన్నివేశాలు
+ సంభాషణలు
+ యాక్షన్‌ దృశ్యాలు

బలహీనతలు
– కథ.. కథనం
– వినోదం లేకపోవడం

చివరిగా: ‘జయదేవ్‌’ ఫక్తు కమర్షియల్‌ కథ

 

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *